ఆధునిక కాలంలో కవిత్వం అభివృద్ధి చెందింది.
అది భావ, అభ్యు దయ, విప్లవ, దళిత, స్త్రీవాద కవిత్వాలుగా వ్యాపించింది.
ఇటువంటి కవిత్వంలో అయినంపూడి శ్రీలక్ష్మి స్త్రీ సమస్యలతోపాటు సామాజిక స్పృహను వివరించారు. వీరి తొలి వచన కవితా సంకలనం ‘అలల వాన’.
శ్రీలక్ష్మి పండిత వంశంలో జన్మించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయిన నాన్న శ్యాంసుందరరావు నుండి సాహిత్య జిజ్ఞాస, ఆత్మస్థైర్యం, అమ్మ నుండి నొప్పించని మాటల తీరు శ్రీలక్ష్మి సంపా దించుకున్నారు. ఇవన్నీ కలగలసి ‘అలల వాన’ అనే వచన కవితా సంకలనంగా రుపొందుకుంది. పచ్చని పచ్చదనం ఈ కాలంలో కరువైపోతోందని ”ఆకుపచ్చని ఆకాశం” అనే కవితలో కవయిత్రి బాధపడ్డారు.
”చిరుగాలుల వీణాతంత్రులపై
అలవోకగా నడిచి వచ్చినట్టు
సాగే అలల మీదుగా
కెరటాలు కెరటాలై పొంగి వచ్చినట్టు నవ్వగలదు” అంట ఆమె పక్షుల కిలకిలలు, నీటి జలజలలు వాటికివ్వగలదు. అటువంటి ఆమెను పారేసుకున్నాను, ఆమె నవ్వును పోగొట్టుకున్నానని కవయిత్రి బాధపడ్డారు.
”మౌనసముద్రంలో పుట్టాను
శోకాకాశంలో పెరిగాను
శశికి పరదానై నిలిచాను
నా మనోబంజరు భూమిలో
ఆశలపువ్వు ఒక్కటైనా పూయదు”
అంట స్త్రీ జీవితం కన్నీటి కడలి. అది ఏ కలలకు నోచుకోదు అంట –
”వెతలన్నీ తెలుపుకుని విషాదాల్ని పంచుకుని
త్యాగాల్ని పెంచుకుని కల్మషం లేని మైదానాలకు
కన్నీళ్ళు లేని మరో గోళాలకు పోదాం పద పోదాం పద”
అంట కుమిలి కుమిలి ఏడుస్తుంటే నవ్వే లోకం వద్దు. నీలాకాశంలో మల్లెపువ్వుగా పూస్తాను. ఈ లోకం వద్దు అంటూ స్త్రీ బాధను ”పోదాం పద” అనే కవితలో తెలిపారు.
పుట్టింటి వారిని వదిలి వెళుతున్న స్త్రీ బాధను ”అలల వాన” అనే కవితలో వివరించారు.
”అమ్మా!
నేను మౌనంగానే వెళ్ళిపోతున్నా
కన్నీరు జారి జారి
బతుకు ఎడారిలో యింకిపోతుంటే
నేను తలొంచుకునే వెళ్ళిపోతున్నా”
తల్లి తండ్రి చేత దెబ్బలు తింటున్నా, అన్నయ్య వేరే కాపురం పెట్టినా, తమ్ముడు తుపాకీ పట్టుకుని వెళ్ళిపోయినా, సినిమా , మొజులో చెల్లి ఇల్లు వదిలినా ఆడపిల్లని కాబట్టి
”కడుపులో దాచుకుని పెంచినందుకు
నీకు కన్నీరునే మిగిలిస్తున్నాను తల్లీ”
అంటూ బాధపడుత ఈ దేశంలో పుట్టిన ప్రతి ఆడది ఇలాగే ఉందన్న నిజాన్ని తెలియపరచారు.
”నయన ఝరి”లో మనిషి కన్ను చేసే పనులను వివరించారు.
”అందమైన అమాయిని చూస్తే కొట్టుకునేది కన్నే
అదుపు తప్పితే తిప్పుకునేది కన్నే
మరో మీనాక్షితో మనసును కలిపేది కన్నే”.
మౌనపు మాటలను అందించేది, వర్షపాతంలో ఉప్పొంగి నవ్వేది, విషాదంలో కన్నీరయ్యేది కన్నే, ప్రకృతిని చూసి పరవశించేది, కాలం కాటేసే చీకట్లోకి తప్పుకునేది కన్నే. అనేక రూపాలతో చిత్రాలను ఆ కన్ను కవయిత్రి చేతులలో ఉంచింది. ‘ఆ కన్నుకు నేనేమివ్వగలను కన్నులా బతకటం తప్ప!” అంట కన్ను గొప్పతనాన్ని వివరించారు.
”వ్యత్యాసం” అనే కవితలో పురుషుడు తన ఆధిక్యత స్త్రీ మీద చూపించడం చాలా సహజమని అన్నారు.
”సూర్యుడు తూర్పున ఉదయించడ౦ మెంత సహజమొ
నీవు లేచిన దగ్గర్నుంచి తిట్టడం అంతే సహజం
పువ్వు వికసించడం యెంత సహజమొ
పురుషాధిక్యతతో సంభాషించడం నీకంత సహజం”
అంత టపాకులు పేలతాయి. అలాగే తుపాకులలాగా మాటలు పేల్చడం అంతే సహజం. భర్త అంటే భరించేవాడంటారు. ఆ పేరు పెట్టిన పుణ్యపురుషుని పేరు చెప్పు అంట ప్రశ్నించారు.
మౌనం ఎంత గొప్పదో ”మౌనసౌధం” అనే కవితలో వివరించారు.
”శబ్దం శబ్దాన్ని కనడం మనకు తెలుసు
మాట మాటను పెంచడమూ మనకు తెలుసు
మౌనం శాంతిని కనడం తెలియదు కానీ
ఆనందాన్ని భరించలేకపోతే ఆవిర్భవించేది మౌనమే”.
ఈ విశ్వంలో మౌనం దాగున్నది. ఆలోచనల ఆవిర్భావానికి మౌనం కారణం. మౌనానికి వర్గాన్ని వెతుక్కుని మౌనసౌధం నిర్మించుకోవాలి. ఆ మౌనంతోనే మనుషులుగా బతకడం నేర్చుకోవాలి. ఆ మౌనంతోనే మానవతను పరిరక్షించు కోవాలన్నారు.
భర్త కోసం భార్య ఎదురుచపులు ”నా కళ్ళు” అనే కవితలో వివరించారు.
”దారెంట వెళ్ళేవాళ్ళలో వెతికి వెతికి వెనుదిరుగుతాయి
నీవులేని యింట్లోకి అవి వెళ్ళలేక
గుమానికి ఇరుపక్కల నీకోసమే వేలాడుతు దారి కాస్తాయి”.
డొక్కు సైకిల్ బెల్లు కోసం చెవులను ఆరుబయటే వెళ్ళాడదీసి ఉంటుంది. రాని ఉత్తరం కోసం ఎల్లవేళలా ఎదురుచూస్తూ ఉంటుంది. సూర్యుడు అస్తమించేదాక నిరీక్షిస్తూ ఉంటుంది భార్య భర్త కోసం.
”భక్తి” అనే కవితలో దేశభక్తి గొప్పతనాన్ని వివరించారు. బాంబులతో చర్చిలను, మనుషులతో మసీదులను కూల్చినంత మాత్రాన జాతుల మధ్య అనుబంధాలు ఆగవు. ఐ.ఎస్.ఐ. వాళ్ళకు మతాలను మారణహోమకాష్టంగా మలచడం మాత్రమే తెలుసు. కానీ మనకు-
”హిందువుల వేదాంతాన్ని కాషాయ వర్ణంగాను
క్రైస్తవుల కార్యదీక్షను శ్వేతవర్ణంగాన
మహమ్మదీయ సోదరవర్గాన్ని ఆకుపచ్చగాను మలుచుకుని
ఎదను కర్రగా మలిచి మువ్వన్నెల జెండా ఎగరేసుకునేవాళ్ళం”
అంట మతం మత్తు చల్లి దేశభక్తిని మతభక్తిగా మార్చకండి, అడ్రస్ లేకుండా పోతారని హెచ్చరిక చేసారు.
”ఐక్యం” అనే కవితలో యువకు లందరికీ ప్రజలను కాపాడు కోవడానికి కదలిరండని ప్రబోధించారు. ఈ రోజులు రక్తం కురుస్తున్నాయి. పొట్ట కోసం పతితల వుతున్నారు. పంట కోసం రైతన్నలు ప్రాణం తాకట్టు పెట్టుకుంటున్నారు.
”సాగుతున్న నరమేధ రక్తవర్షాన్నాపుదాం
ప్రపంచాగ్నిలో సమిధలమైనా సరే
ప్రజల్ని కాపాడుకుందాం రండి!” అంట దేశ దుస్థితిని తన కవితలో చిత్రిస్త, కవయిత్రులు సమకాలీన సమాజానికి దూరం కారని నిరపించారు.
చిన్నపిల్లలను పనిలో పెట్టుకుంటున్న దుస్థితిని ”పాలబుగ్గల బాల్యం” అనే కవితలో వివరించారు.
”అక్కడ
పాఠాల్ని వల్లెవేయల్సిన వయసు
బతుకుపాఠాన్ని వినిపిస్తుంది
పుస్తకాల్ని పట్టుకోవలసిన చేతులే
తట్టలనీ పారలనీ పట్టుకుంటాయి”
అంట మనుషుల స్వార్థానికి బాలలు కర్మాగారాలకు తాకట్టుపడ్డారు. గనుల భూతానికి బానిసలై బతుకుతున్నారు. ముక్కుపచ్చలారని బాల్యాన్ని రోజుకింత అని అమ్ముకుంటున్నారు అని అన్నారు.
చదువు మనిషికి దారి చూపిస్తుంది, జీవితాన్నిస్తుందని ”అక్షరం, నీకు ఆహ్వానం!” అనే కవితలో వివరించారు. మూఢత్వానికి ముగింపు పలుకుత రేపటి ఉద్యమం కోసం అక్షరాన్ని అందుకోమన్నారు కవయిత్రి. మానవత్వాన్ని పెంపు చేస్త అక్షరమంత్రాన్ని పఠించమన్నారు. చీకటి చేత్తో నెడుత రేపటి వెలుగు కోసం అక్షరదీపం వెలిగించ మన్నారు.
”అగాధపు లోతుల్ని తడుముకుంట
బతుకు బాటను చసుకోమంటున్నా
అక్షరం గమ్యానికి మెట్టవుతుంది
అక్షరం నిన్ను నడిపించే కర్రవుతుంది”
అంట చదువు గొప్పతనాన్ని చెప్పారు.
మెతుకుకోసం మనిషి పడే పాట్లను ”మెతుకుకు జీవం పోయల్సిందే” అనే కవితలో వివరించారు.
”చెత్తకుప్పల దగ్గర
వీథికుక్కలతో కాట్లాడే
అనాధ బాధ మెతుకేనా!
పన్నెండేళ్ళకే పమిటను వీథిలో పరచిన
విరియని మొగ్గల వేదనాయెక్కిళ్ళు మెతుకుకేనా!” అంట పురుగుమందుల కోసం రైతులు ఉరేసుకు చనిపోయారు. అడుక్కు తినేవాడు రక్తం కారేట్టు కొట్టుకునేది మెతుకు కోసమే. మెతుకు కోసం బతుకు యుద్ధం చేయలి. మెతుకు మొలకకు జీవం పోయలి అంట తిండి కోసం పడే బాధను వివరించారు.
శ్రీలక్ష్మి తన ”అలలవాన” అనే కవితా సంపుటిలో స్త్రీ సమస్యలే కాక, సామాజిక సమస్యలను కూడా వివరించారు. ఈనాటి సాహిత్యసీమలో తనకంటూ ఒక స్థానాన్ని నెలకొల్పుకున్నారు.